మెకును అలర్ట్‌: బస్‌ రూట్స్‌ని రద్దు చేసిన మవసలాత్‌

- May 23, 2018 , by Maagulf
మెకును అలర్ట్‌: బస్‌ రూట్స్‌ని రద్దు చేసిన మవసలాత్‌

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలాత్‌) సైక్లోన్‌ మెకును కారణంగా ఆరు రూట్లలో బస్సుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్‌ నుంచి దోఫార్‌, వుస్తా తదితర రూట్లకు బస్సుల్ని రద్దు చేశారు. మే 24 నుంచి ఈ బస్సుల రద్దు అమల్లోకి వస్తుంది. ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మవసలాత్‌ పేర్కొంది. మస్కట్‌ - సలాలా, మస్కట్‌ - మార్ముల్‌, మస్కట్‌ - దుక్మ్‌, సలాలా - మజైయూనా, దుక్మ్‌ - హైమా మరియు సలాలా - మార్ముల్‌ మార్గాల్లో బస్సుల్ని మవసలాత్‌ నిలిపివేస్తుంది. గురువారం ఈ రూట్లలో కేవలం మూడు ట్రిప్స్‌ మాత్రమే నడుస్తాయి. సైక్లోన్‌ తీవ్రత తగ్గాక ఈ రూట్లలో బస్సులు యధాతథంగా నడుస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com