వేసవిలో మెుక్కజొన్నలు తింటే గర్భణీ మహిళలకు ఉపయోగాలు
- May 24, 2018
మెుక్కజొన్న తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మెుక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నిషియం, ఐరన్, రాగి, పాస్ఫరస్ ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ఈ విత్తనాలతో చేసిన నూనెను చర్మానికి రాసుకుంటే దద్దుర్లు రాకుండా ఉంటాయి.
మెుక్కజొన్నలో పీచు పదార్థం వల్ల జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్దకం, పేగు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. దీన్ని గర్భవతులు తినడం వలన వారి కడుపులో శిశువు మంచి బరువును కలిగి ఉంటారు. కాళ్లు, చేతులు వాపు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి12, ఐరన్ సమస్యను దూరం చేస్తాయి. రక్తహీనతను అరికట్టడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఈ మెుక్కజొన్నలో శక్తివంతమైన పోషకాలు, ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, బి, సి, ఇ లభిస్తాయి. ఇందులో పాంటేథైనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది రక్తంలోని ఎర్రరక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెకు ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్తసరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గుండెపోటు, పక్షవాతం, బి పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరపు ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇందులో ఉండే ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు, నాడివ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మెుక్కజొన్నలో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వకుండా చేస్తుంది. అందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు తమ డైట్‌లో మెుక్కజొన్నతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







