మనామాలో అడ్వాన్స్‌డ్ మెట్రో నెట్‌వర్క్
- May 28, 2018
బహ్రెయిన్:బహ్రెయిన్ త్వరలో అడ్వాన్స్ మెట్రో నెట్‌వర్క్‌ని సొంతం చేసుకోబోతోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలిమ్యూనికేషన్ అప్పుడే చర్యలు ప్రారంభించింది. ప్రధమిక దశలో మెట్రో నెట్‌వర్క్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌నీ, మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్ని కలిపేలా తీర్చిదిద్దబడుతుందని తెలుస్తోంది. వీటిల్లో బహ్రెయిన్ బే, బాబ్ అల్ బహ్రెయిన్, ఫైనాన్షియల్ హార్బర్, సీఫ్ తదితర ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ తొలి దశలో రాబోతోంది. జులై నాటికి ఫైనల్ ప్లాన్స్ ఖరారవుతాయని చెప్పారు ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమాల్ అహ్మద్. అడ్వాన్స్ మెట్రో రాకతో బహ్రెయిన్ అభివృద్ధిలో మరో మైలు రాయిలా బావించాల్సి వుంటుందని ఆయన వివరించారు. మరోపక్క జిసిసి రైల్ ప్రాజెక్ట్ చాలా వేగంగా పూర్తవుతోంది. యూఏఈ, సౌదీ అరేబియా 2021 నాటికి ఒమన్‌తో లింక్ పూర్తి చేస్తాయి. కువైట్, బహ్రెయిన్ 2023 నాటికి జాయిన్ అవుతాయి. 15.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







