ఐఐఐటీ హైదరాబాద్‌లో 14వ ఐబీపీఎస్‌ఏ అంతర్జాతీయ సదస్సు 'బిల్డింగ్ సిమ్యులేషన్ -2015' పేరిట ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భవన నిర్మాణంలో, వాటి శక్తి సామర్థ్యాల పెంపుపై అవలంభించాల్సిన అధునాతన పద్దతులపై సుదీర్ఘంగా చర్చించారు. భవనాల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో సిమ్యులేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐఐఐటీ హైదరాబాద్‌లోని హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్ ప్రొఫెసర్ విశాల్ గార్గ్ అన్నారు. వచ్చే 15 సంవత్సరాలలో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయని.. ప్రస్తుతం ఈ సదస్సుకు హాజరైన నిపుణులు భారత్‌కు చెందిన పరిశోధకులకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ ఛైర్‌పర్సన్ వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
4వ ఐబీపీఎస్‌ఏ అంతర్జాతీయ సదస్సు..
- December 08, 2015తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







