నిపా వైరస్ భయం...కేరళ పండ్ల దిగుమతిపై గల్ఫ్ దేశాల నిషేధం

- May 28, 2018 , by Maagulf
నిపా వైరస్ భయం...కేరళ పండ్ల దిగుమతిపై గల్ఫ్ దేశాల నిషేధం

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన నిపా వైరస్ ఆ రాష్ట్ర పర్యాటక రంగాన్నే కాదు పండ్ల వ్యాపారాన్ని సైతం దెబ్బతీసింది. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ సోకి పదిమందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి పండ్ల దిగుమతిపై గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి. నిపా వైరస్ తమ దేశంలోకి వ్యాపిస్తుందనే భయంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ దేశాలు కేరళ పండ్లు, కూరగాయల దిగుమతిని నిషేధించాయి. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి వచ్చిన పండ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు తిప్పి పంపించాయి. పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా గల్ఫ్ దేశాలు కేరళ నుంచి పండ్లు, కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవి. నిపా వైరస్ సోకిన నేపథ్యంలో కేరళ నుంచి పండ్లు, కూరగాయలు పంపించవద్దని గల్ఫ్ దేశాల వ్యాపారులు కోరారు. తిరువనంతపురం నుంచి ప్రతీరోజూ 50 టన్నుల పండ్లు, కూరగాయలను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. నిపా వైరస్ వల్ల పండ్లు, కూరగాయల ఎగుమతి నిలచిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు, రైతులు ఆవేదనగా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com