నిపా వైరస్ వ్యాప్తి..పండుగలు,ఇఫ్తార్ విందుల రద్దు
- May 28, 2018
మణప్పురం: కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లాలో నిపా వైరస్ అనుమానంతో జిల్లావైద్యఆరోగ్య శాఖాధికారులు 400 మందిని ముందుజాగ్రత్త చర్యగా వైద్యుల పరిశీలనలో ఉంచారు. నిపా వైరస్ లక్షణాలున్న రోగులను ప్రత్యేక ఆసుపత్రులకు పంపించాలని మణప్పురం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె. సకీనా ఆదేశించారు. నిపా వైరస్ సోకిన రోగులను ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు సహాయకులుగా ఉన్న ఐదు అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలిస్తున్నామని డాక్టర్ సకీనా వెల్లడించారు. నిపా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో పండుగలు, సమ్మేళనాలు, ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని డాక్టర్ సూచించారు. దీంతోపాటు ప్రభుత్వ అధికారిక ఉత్సవాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మణప్పురం జిల్లా కలెక్టరు అమిత్ మీనా ఆదేశాలు జారీ చేశారు. జూన్ 6వతేదీ వరకు పాఠశాలలు, కళాశాలలను మూసి ఉంచాలని కలెక్టరు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







