సౌదీలో ప్రమాదం: ఒకరి మృతి

- May 30, 2018 , by Maagulf
సౌదీలో ప్రమాదం: ఒకరి మృతి

మస్కట్‌: సౌదీ అరేబియాలో జరిగిన ఓ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, బాధితుల్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి, సుల్తానేట్‌కి తరలించింది. సౌదీ అరేబియాకి ప్రత్యేక విమానాన్ని ఇందు కోసం తీసుకెళ్ళారు. ఈ విమానంలో అవసరమైన వైద్య సదుపాయాలతోపాటు, మెడికల్‌ పర్సనల్స్‌ కూడా వున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సహకారంతో ఈ విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాయపడ్డవారిని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య అవసరాల నిమిత్తం ఈ తరహా 'ఎయిర్‌ లిఫ్టింగ్‌' చర్యలను చేపట్టడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ప్రజల మన్ననల్ని అందుకుంటున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com