దుబాయ్ క్రీక్ టవర్‌కి కాంక్రీట్ ప్లేస్‌మెంట్ పూర్తి
- May 30, 2018
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న దుబాయ్ క్రీక్ టవర్‌కి సంబంధించి పైల్ క్యాప్ కాంక్రీట్ ప్లేస్‌మెంట్ పూర్తయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న సమయానికంటే రెండు నెలల ముందే ఈ పని పూర్తవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కాంక్రీట్ పోరింగ్ పనులు పూర్తి కాగా, జనవరి నాటికి మొత్తం 50 శాతం పని పూర్తయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 450 మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఈ సైట్ కోసం పనిచేస్తున్నారు. స్పానిష్ / స్విస్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్ సాంటియాగో కాలాట్రావా వాల్లాస్ ఈ దుబాయ్ క్రీక్‌ని డిజైన్ చేశారు. పలు అబ్జర్వేషన్ డెక్స్ ఇందులో వుంటాయి. పినాకిల్ రూమ్, విఐపీ అబ్జర్వేషన్ డెక్స్‌ని ఇందులో పొందుపర్చుతారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, 2021లో ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







