ఉత్సాహంగా సాగుతున్న మోడీ ఇండోనేషియా పర్యటన
- May 30, 2018
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియా పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. మూడు దేశాల టూర్ లో భాగంగా నిన్న రాత్రి ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్న మోడీ.. ఇవాళ ఉదయం... అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీ అయ్యారు. మెర్దేకా ప్యాలెస్ చేరుకున్న మోడీకి.. అధ్యక్షుడు విడోడో స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం కాలిబటలో అమరవీరులకు నివాళులు అర్పించారు
అనంతరం రెండు దేశాల స్నేహ బంధానికి గుర్తుగా ఓ శిలాఫలకాన్ని ప్రధాని మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన మ్యూజియం సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ ఆ దేశ సంప్రదాయ డ్రమ్స్ వాయించి అందరినీ అలరించారు..
ఆ తర్వాత రెండు దేశాల అధినేతలు... వ్యూహాత్మక చర్చలు జరిపారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్... సాగర్ అన్నది తన పర్యటన థీమ్ అని మోడీ వెల్లడించారు.
ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన బంధాలున్న ఈ రెండు దేశాలు.. భవిష్యత్తులో మరింత స్నేహభావంతో మెలగాలని నిర్ణయించారు. అలాగే ఉగ్రవాదంపై ఇండోనేషియా జరుపుతున్న పోరాటానికి భారత్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







