జనవరి 1 నుంచి 2 మిలియన్‌ వీసాలు

- December 08, 2015 , by Maagulf
జనవరి 1 నుంచి 2 మిలియన్‌ వీసాలు

దుబాయ్‌లోని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారినర్స్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) 59 మిలియన్‌ లావాదేవీల్ని 2015 ప్రారంభం నుంచి నిర్వహించింది. 12 మిలియన్‌ వీసాలు ఈ కాలంలో జారీ చేసింది. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ మహ్మద్‌ అహ్మద్‌ అల్‌ మర్రి మాట్లాడుతూ, 42 మిలియన్‌ ప్రయాణీకులు దుబాయ్‌ బోర్డర్స్‌ ద్వారా జనవరి 1 నుంచి నవంబర్‌ వరకూ ప్రయాణించినట్లు చెప్పారు. మేజర్‌ జనరల్‌ అల్‌ మర్రి ఇంకా మాట్లాడుతూ, అథారిటీ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టిందనీ, పనితీరు సామర్థ్యం పెంపుతోపాటు, మహిళా వర్కర్ల కోసం పని వేళల్ని వీలుగా మార్చడం జరిగిందని చెప్పారు. పని ప్రాంతాల్లో ప్రమాదాల గురించీ, ఇతర ఇబ్బందుల గురించి అవగాహన పెంచడం ద్వారా ఉద్యోగార్థులకు సహాయపడ్డామని డిప్యూటీ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఒబైద్‌ మొహైర్‌ బిన్‌ సురూర్‌ అన్నారు. యూఎస్‌ బేస్డ్‌ రిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మేరీ రూత్‌ మాట్లాడుతూ, మిడిల్‌ ఈస్ట్‌లో ఈ తరహా కాన్ఫ్‌రెన్స్‌ని తొలిసారిగా నిర్వహించినట్లు చెప్పారు. రెండు రోజుల పాటు మిడిల్‌ ఈస్ట్‌లోని ఇన్స్యూరెన్స్‌ మార్కెట్‌పై జరిగిన ఎడ్యుకేఏషన్‌ మరియు నెట్‌వర్కింగ్‌ కాన్ఫరెన్స్‌లో హాజరైన ఔత్సాహికులకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రేటజీస్‌ పట్ల అవగాహన కలగజేశామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com