సమ్మోహనాన్ని ఆవిష్కరించిన మామ
- May 31, 2018


సుధీర్ బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన సమ్మోహనం మూవీ ట్రైలర్ నేడు(గురువారం) రిలీజ్ అయింది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను సుధీర్ బాబు మామ, సూపర్ స్టార్ కృష్ణ రిలీజ్ చేశారు. గురువారం కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనతోనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించింది చిత్రబృందం. 'ఏముందిరా ఆ స్టార్‌ల్లో ఆ గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం, నటన అబద్ధం.. అయినా ఎగబడతారేంటిరా..' అనే సుధీర్ బాబు డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
సినీ ప్రియుడిగా, సుధీర్ బాబు తండ్రిగా సీనియర్ నరేష్ అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాల పట్ల మంచి అభిప్రాయం లేని యువకుడిగా సుధీర్ బాబు అలరించారు. సినిమాలో తెలుగు రాని హీరోయిన్‌గా అదితీరావు ఆకట్టుకుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







