వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్...
- June 01, 2018
న్యూఢిల్లీ: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. తన ప్లాట్‌ఫాంలో రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా ప్రిడెక్టెడ్ అప్లోడ్ (Predicted Upload) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోస్ రెండు వెర్షన్లలోనూ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫోటో షేరింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ వెర్షన్ 2.18.156, ఐవోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఐఫోన్లలో వాట్సాప్ 2.18.61 వెర్షన్ వాడుతున్నవారిలో కొందరు ఎంపిక చేయబడిన యూజర్లకు ప్రస్తుతం ఈ సదుపాయం లభ్యం. అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తమ మిత్రులతో తరచూ ఫోటోలను షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. కేవలం పది సెకండ్లలోనే 12 ఫోటోలను సెండ్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌కు పూర్తి భద్రత కూడా ఉందని తెలిపింది. అలాగే వీడియోలు, జిఫ్ పైల్ షేరింగ్‌కు మాత్రం ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. ఎవరికైనా ఫోటోలు పంపించేటప్పుడు ఫోటోలు ఎంపికచేసి సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే అవి వాట్సప్ సర్వర్లోకి అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయ్యాక మళ్లీ సెండ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రిడెక్టెడ్ అప్లోడ్ ఫీచర్ కారణంగా డైరెక్టుగా గేలరీ నుండి కావలసిన ఫోటోలు సెలెక్ట్ చేసిన వెంటనే అవి వాట్సప్ సర్వర్కి అప్లోడ్ అవుతాయి. సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫోటోలు షేర్ అవుతాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







