చెర్రీ, తారక్‌ల మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తికర కథనం!
- June 01, 2018
తారక్, చెర్రీలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీపై రోజుకో వార్త చక్కర్లుకొడుతుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా రాజమౌళి ఈ మూవీ స్టోరీ గురించి సింగల్ లైన్ కూడ చెప్పకముందే ఈ సినిమా కథకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ మూవీలో చెర్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఆయన సోదరుడిగా తారక్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారంటూ టాలీవుడ్ టాక్. అంతేగాక ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్‌గా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







