బహ్రెయిన్ లో ఘనంగా 'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు..
- June 02, 2018
బహ్రెయిన్:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ తరుపున 4వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి సహకారం వల్లే మన స్వరాష్ట్ర కళ సాకారమైందని వారు పేర్కొన్నారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ముందుగా తెలంగాణ అమరవీరులకు క్రొవ్వత్తులు వెలిగించి, పూలతో నివాళులు అర్పించారు.
అనంతరం వారి వీరత్యాగాలను స్మరించుకుని, కేకు కట్ చేసి ఆనందోత్సాలతో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను జరుపుకున్నారు. నాలుగవ రాష్ట్ర అవతరణ వేడుకలను బహ్రెయిన్ లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుందన్నారు.
ముఖ్యంగా మన తెలంగాణ గల్ఫ్ ప్రవాసులకూ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆదుకోవడానికి 50 కోట్ల నిధులతో ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60ఏళ్ల పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకబాటుకు గురైందని గుర్తుచేశారు.
అనేక ఆశలు, ఆశయాలతో, అమరుల త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అదే కృషి, పట్టుదల, సంకల్పంతో మన ఉద్యమనేత గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత నాలుగేళ్ళుగా చేపడుతున్న సంక్షేమ పథకంలు పింఛన్లు, కళ్యాణ లక్మి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మంచినీటి కోసం మిషన్‌భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ 24గంటల విద్యుత్, ప్రాజెక్టులనిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పథకాలతో ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నారని చెప్పారు.
దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా, ఒకప్పుడు మొగులు వంకచూసిన రైతు బిడ్డలను నేడు రాజులుగా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన సారథ్యంలో రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలతో గల్ఫ్ వలసలు కూడా కొంత తగ్గే ఆవకాముందన్నారు.
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్నిరంగాలను కేసీఆర్ అభివృద్ధి చేస్తూ జనరంజక పాలనా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా.రవి, సెక్రెటరీలు రాజేంధార్, రవిపటేల్, గంగాధర్, జాయంట్ సెక్రెటరీలు విజయ్, దేవన్న, రాజేందర్ రావు, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ ప్రమోద్, సాయన్న, సురేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







