ఖుబానీ కా మీఠా

ఖుబానీ కా మీఠా

కావలసిన పదార్థాలు : ఎండు ఖుబానీ పండ్లు(ఎండు ఆప్రికాట్స్‌)-అర కిలో, పంచదార-250గ్రా, క్రీమ్‌-100గ్రా, నీళ్లు-ఒక లీటరు. 
తయారుచేసే విధానం : ముందుగా ఖుబానీ పండ్లను శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించాలి. ఉడికాక దించి 3-4 గంటలు చల్లార్చాలి. వాటిలోని గింజలను తీసి పక్కన ప్లేటులో ఉంచుకుని, ఖుబానీ పండ్లలో పంచదార వేసి స్టవ్‌పై ఉంచాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఖుబానీ పండ్ల గుజ్జు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు ఖుబానీ పండ్ల గింజలను పగలగొట్టి మధ్యలో ఉండే పప్పును తీసి గంట సేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిపై ఉండే పొరను వలిచేయాలి. వీటిని ఖుబానీ గుజ్జులో కలపాలి. తినే ముందు ఖుబానీ కా మీఠాను బౌల్‌లోకి తీసుకుని పైన పాల క్రీమ్‌గాని లేదంటే వెనీలా ఐస్‌క్రీంగాని వేసి, పుదీన ఆకులు, చెర్రీతో అలంకరించాలి.

Back to Top