బాబోయ్ కేరళ సరుకు వద్దంటున్న గల్ప్ మార్కెట్

- June 05, 2018 , by Maagulf
బాబోయ్ కేరళ సరుకు వద్దంటున్న గల్ప్ మార్కెట్

నిఫా వైరస్ వార్తలతో కేరళ అంటేనే వణికి పోతున్నారు జనం. కేరళకు ఎవరైనా వెళ్లినా.. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా అనుమానంగా చూసే పరిస్థితి దాపురించింది. దాదాపు చాలా వస్తువుల దిగుమతిని నిఫా భయంతో నిషేధం విధించింది గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా,దుబాయ్.100 టన్నుల పండ్లను, కూరగాయలతో పాటు వివిధ తాజా ఉత్పత్తులను కూడా దేశంలోనికి అనుమతించకుండా ఆపేసినట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎన్సిఫాలిటిస్ అనే జబ్బు వస్తుంది. దీని కారణంగా మెదడు వాపునకు గురవుతుంది. దాంతో పాటు జ్వరం, తలనొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వంటి లక్షణాలు కనపడతాయి. ఇప్పటి వరకు కేరళలో ఈ వైరస్ సోకి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో 2 వేల మందిని అనుమానితులుగా గుర్తించి చికిత్సనందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com