'జెట్ ఎయిర్‌వేస్' వారి సేవింగ్స్ ఆఫర్
- June 05, 2018
ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేవింగ్స్ పథకం కింద జెట్ ఎయిర్‌వేస్ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో టికెట్లపై తగ్గింపును అందిస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది.
దేశీయ మార్గంలో టికెపై 400 రూపాయలదాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ విమాన టికెట్లపై 600 రూపాయల దాకా తగ్గింపురేట్లను వర్తింప చేస్తోంది. వన్ వే టికెట్లపై 200 రూపాయల దాకా, రిటర్న్ జర్నీపై రూ.600 దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దేశీయ మార్గంలో కూడా ఇదే ఆఫర్‌ను అందిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాసు టికెట్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణానికి కనీసం పదిహేను రోజులముందుగా బుక్ చేసుకున్న, ఇండియన్ రూపీ కరెన్సీ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







