'సమ్మోహనం' సినిమా సెన్సార్ పూర్తి
- June 07, 2018
సమ్మోహనం చిత్రానికి ఎటువంటి కత్తెర పడలేదట. అదేనండీ సెన్సార్ కత్తెర. నటుడు సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ మూవీలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది. జూన్ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అదితి రావు హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్