నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త
- June 07, 2018
అమరావతి:నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు.
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతం ‘ ఫేజ్ జీరో’ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఏడీపీ, సింగపూర్ కన్సార్షియం మధ్య అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
సింగపూర్ సంస్థలు ముందుకొస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగవంతమవుతుందన్నారు. అమరావతికి బృహత్ ప్రణాళిక ఇచ్చిన సింగపూర్... నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..