పచ్చకర్పూరంతో వెన్నను తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే...
- June 07, 2018ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం పొందుతాము. కానీ అప్పటికి ఆ సమస్య తగ్గినా పూర్తిగా నయం కాదు. అయితే సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
1. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. కంటిచూపు మందగించడం తగ్గుతుంది.
2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. పొన్నగంటికూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితేవారికి కంటి సమస్యలు దూరమవుతాయి.
4. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!