దక్షిణి సాగ్‌

దక్షిణి సాగ్‌

కావలసినవి: బీన్స్‌ 100 గ్రాములు (డైమండ్‌ ఆకారంలో తరిగి), క్యారెట్‌ 100 గ్రాములు (డైమండ్‌ ఆకారంలో తరిగి), కాలీఫ్లవర్‌ పువ్వులు 100 గ్రాములు, పచ్చి బఠాణీ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, టొమాటొ 100 గ్రాములు (సన్నగా తరిగి), వెల్లుల్లి 30 గ్రాములు (సన్నగా తరిగి), పాలకూర 800 గ్రాములు, వాము ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి నాలుగు, కొత్తిమీర రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఉప్పు తగినంత, కారం ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె 50 గ్రాములు, రెండు కాయల తాజా నిమ్మరసం.
ఎలా చేయాలి: కూరగాయలన్నింటిని కలిపి వేడినీటిలో ముంచి తీసి తరువాత చల్లటి నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. పాలకూరను వేడినీటిలో ముంచి నీటిని పిండి సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేడిచేసిన గిన్నెలో నూనె వేసి వాము వేయాలి. తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటొలు, కూరగాయలను వేసి కొంచెంసేపు ఉడికించాలి. తాలింపు పెట్టి తరిగిన పాలకూరను అందులో కలపాలి. స్టవ్‌ మీద నుంచి గిన్నె దించి నిమ్మరసం కలపాలి. కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఇది నలుగురికి సరిపోతుంది.

Back to Top