తెలంగాణ:కిడ్నీబాధితుడికి ఆర్థిక సహాయం చేసిన 'గల్ఫ్ ఎన్.ఆర్.ఐ ఫ్రెండ్స్'
- June 08, 2018
తెలంగాణ:ముస్తాబాద్ మండలం అవునురా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గంగిరెడ్డి మహేందర్ రెడ్డి సునీత దంపతుల కుమారుడు వెంకటేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని గల్ఫ్ ఎన్.ఆర్.ఐ మిత్ర ఫ్రెండ్స్ కుటుంబాల మహేందర్,జనగామ నివాస్,పురుషోత్తం,కరుణాకర్ ,సాయి రాంచందర్ బృందంతో 35 వేల ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టచేతపట్టుకుని మహేందర్ రెడ్డి 7 వేల జీతంతో కూలి పని చేసుకుంటూ గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న సమయంలో తన కొడుకుకు రెండు కిడ్నీలు ఫేలవడంతో తన భార్య సునీత ఒక కిడ్నీ దానం చేయడం జరిగిందని ఆపరేషన్ ఫేల్ కావడం వల్ల ఆ కుటుంబం రోడ్డునపడిందని ఈ కుటుంబాన్ని మానవదృక్పదంతో ఆలోచించి ప్రజాప్రతినిధులు గాని,ఎన్.ఆర్.ఐ మిత్రులుగాని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.అప్పులలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







