మస్కట్:వాటర్ బాటిల్స్‌లో బ్యాక్టీరియా, అల్గాయ్
- June 08, 2018
మస్కట్: అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వున్న వాటర్ బాటిల్స్‌ని విక్రయిస్తున్న కారణంగా ఓ కంపెనీకి 600 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పిఎసిపి అధికారులు తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వాటర్ బాటిల్స్‌లోని నీటిలో బ్యాక్టీరియా, అల్గాయ్ కన్పించాయి. ఈ బాటిల్స్‌లో నీరు తాగితే అనారోగ్యం పాలవడం ఖాయమని అధికారులు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్‌కి జరీమానా విధించడమే కాక, హెచ్చరికలు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేలా, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా డిస్ట్రిబ్యూటర్స్, విక్రయదారులు వ్యవహరించరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







