చైనాకు బయలు దేరిన నరేంద్ర మోడీ
- June 08, 2018
న్యూఢిల్లీ : చైనాలోని క్వింగ్డావోలో రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సమావేశాల్లో పాల్గనేందుకు నరేంద్రమోడీ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆరు వారాల మోడీ చైైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ సహకార సంస్థను విస్తరించిన తర్వాత ఏర్పాటవుతున్న తొలి సమావేశాల్లో అక్కడాయన పాల్గంటారు. గత ఏడాది కజకిస్థాన్ లో జరిగిన ఆస్తానా సమ్మిట్‌లో భారత్, పాకిస్థాన్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గంటున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోడీ క్వింగ్డావో చేరుకుంటారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







