రాజధానిలో ఎన్‌కౌంటర్..నలుగురు గ్యాంగ్‌స్టార్స్ హతం
- June 09, 2018
దేశ రాజధాని ఢిల్లీలో అలజడి.. ఫతేఫూర్ భేరీ ప్రాంతం భారీ కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులకు, మాఫియా ముఠా సభ్యులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు కాల్పుల్లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్, రాజేశ్ భారతి, అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు.
మిట్టమధ్యాహ్నం ఢిల్లీ బుల్లెట్ల మోతతో హోరెత్తింది. గ్యాంగ్‌స్టర్ రాజేష్ భారతి, అతడి అనుచరులను ఢిల్లీ స్పెషల్ టీమ్ మట్టుబెట్టింది. ఛత్తర్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
...
ఢిల్లీ, హరియానా, యూపీ తదితర రాష్ట్రాల్లో రాజేశ్ ముఠా పలు హత్యలు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, అత్యాచారాలకు పాల్పడింది. ఇటీవల అరెస్టయిన ఈ గ్యాంగ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని తిరుగుతోంది. 12 కేసుల్లో నిందితుడైన రాజేశ్ తలపై లక్ష రూపాయల రివార్డు ఉంది.
ఇతడి కోసం ఢిల్లీ పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నారు. ఛత్తర్‌పూర్‌లోని ఫామ్‌హౌస్ వస్తారంటూ మూడు నెలలుగా నిఘా పెట్టిన స్పెషల్ టీమ్‌కు.. శనివారం మధ్యాహ్నం రాజేశ్ అండ్ గ్యాంగ్ తారసపడింది. లొంగిపోవాలంటూ పోలీసులు హెచ్చరించినా.. రాజేశ్ గ్యాంగ్ వినకుండా కాల్పులు మొదలుపెట్టింది. దీంతో.. పోలీసులూ ఎదురుకాల్పులూ మొదలుపెట్టారు... దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు అనుచరులు హతమయ్యారు. ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. రాజేశ్‌తోపాటు హతమైన వారిని విద్రోహ్, భికూ, ఉమేశ్ డాన్‌లుగా గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







