షాకింగ్ న్యూస్:సల్మాన్ హత్యకు కుట్ర...హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్..!
- June 10, 2018
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలన్న కుట్ర భగ్నమయ్యింది. హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా అరెస్ట్‌తో.. భారీ కుట్ర బయటపడింది. సల్మాన్‌ను హత్య చేయడానికి. .ముంబై వెళ్లి.. అతని ఇంటి దగ్గరే సంపత్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. జోథ్‌పూర్ నుంచి బెయిల్‌పై విడుదలై.. సల్మాన్ ముంబై చేరుకున్న సమయంలో.. సంపత్ కూడా అక్కడే ఉన్నాడు. సల్మాన్ ఫ్యాన్‌లా నటిస్తూ.. గెలాక్సీ అపార్ట్‌మెంట్ దగ్గర హత్యకు ప్లాన్ చేశాడు. ఆ తర్వాత సైలెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చి దాక్కున్నాడు.
ఉత్తరాదిలో డజనుకు పైగా హత్యలతో పాటు, భారీగా నేరాలకు పాల్పడిన సంపత్ నెహ్రా... హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. అక్కడి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు సంపత్. జోధ్‌పూర్‌లోనే సల్మాన్‌ను చంపేస్తామంటూ గతంలోనే లారెన్స్ బెదిరించాడు. అయితే.. పోలీసులు లారెన్స్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేయడంతో ఆ పథకం పారలేదు. కానీ.. సంపత్ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుని.. సల్మాన్‌ను హత్య చేయడానికి స్కెచ్ వేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తూ.. హైదరాబాద్‌లో మారు పేరుతో తలదాచుకున్నాడు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి.. తన పేరును సందీప్‌గా మార్చుకుని.. నకిలీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను సంపాదించాడు. హైదరాబాద్‌లో రాజస్థాన్ విద్యార్థులతో పరిచయం పెంచుకుని, వారి గదిలోనే మకాం వేశాడు. ఉద్యోగం కోసం వచ్చానంటూ వారిని నమ్మించాడు. దాదాపు 20 రోజులుగా సంపత్ ఇక్కడ ఉంటున్నా.. ఎవరికీ అనుమానం రాలేదు. మొబైల్ వాడితే దొరికిపోతామన్న భయంతో.. ఇంటర్నెట్ ద్వారా తన వాళ్లతో చాటింగ్ చేశాడు. కానీ, దాన్ని పసిగట్టిన హర్యానా పోలీసులు.. సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేట మొదలయ్యింది. దీంతో. .దాదాపు 20 మంది పోలీసులు మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలను జల్లెడ పట్టారు. అనుమానితులపై నిఘా పెంచారు. చివరకు మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడని నిర్ధారించుకుని.. టార్గెట్ చేశారు. గత బుధవారం సాయంత్రం టీ తాగడానికి సంపత్ బయటకురావడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే ఫోటో తీసి. .హర్యానా పోలీసులకు పంపించారు. అతడేనని నిర్ధారించడంతో.. వెంటనే అతన్ని ఫాలో అయ్యారు. గదిలోకి వెళ్లగానే చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.
హర్యానా పోలీసుల ఇంటరాగేషన్‌లో సల్మాన్ హత్యకు పన్నిన కుట్రను వివరించాడు సంపత్. ముంబై వెళ్లి రెక్కీ చేసిన విషయాన్నీ బయటపెట్టాడు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







