సౌదీ అరేబియా:హౌతీ తిరుగుబాటుదారుల వైమానిక దాడి
- June 10, 2018
రియాద్ : సౌదీ అరేబియాలో హౌతీ తిరుగుబాటుదారులు వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సౌదీ మిలిటరీ అధికార ప్రతినిధి అల్ మాలికీ తెలిపిన వివరాల ప్రకారం...యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వైమానిక దాడితో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. కాగా, హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోంది. ఈనేపథ్యంలో తిరుగుబాటుదారులు ఇరాన్ సహకారంతో సౌదీపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యెమెన్‌లో 2015లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 10వేల మంది చనిపోయారు. ప్రాణభయంతో దాదాపు 30లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..