హోటల్స్, రెస్టారెంట్స్ ఫీజుల్ని తగ్గించిన దుబాయ్
- June 11, 2018
దుబాయ్‌ని మరింత ఫ్రెండ్లీ ఇన్వెస్టిమెంట్ డెస్టినేషన్‌గా మార్చేందుకోసం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ మునిసిపాలిటీ ఫీజుల తగ్గింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం రెస్టారెంట్లు, హోటల్స్‌కి సంబంధించి సేల్స్ ఫీజ్‌ని 10 నుంచి 7 శాతం తగ్గనుంది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పాలసీ ప్రకారం, దుబాయ్‌లో పోటీతత్వాన్ని ఆయా రంగాల్లో పెంచేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు షేక్ హమదాన్ చెప్పారు. దుబాయ్‌ని ప్రతి ఒక్కరూ బిజినెస్ డెస్టినేషన్‌లో మార్చుకోవాలనీ, అందుకు తగ్గ విధంగా పలు ఆకర్షణీయమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తూనే వుంటాయని ఆయన వివరించారు. టూరిజం, హోటల్ సెక్టార్‌లో పెట్టుబడులకు ఎప్పుడూ అవకాశాలు వుంటాయనీ, ఈ విభాగంలో వృద్ధిని వీలైనంత ఎక్కువగా నమోదు చేయడమే తలక్ష్యమని చెప్పారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..