మల్టీస్టారర్ సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్.!
- June 13, 2018
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నా నువ్వే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటించడం జరిగింది. రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కథతో రాబోతున్నాడు. పవన్ సాతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తో పాటు మరో హీరో నటించనున్నాడు. ప్రస్తుతం ముగ్గురు , నలుగుర్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. వారిలో ఒకర్ని ఎంపిక చేస్తారట.
దీని ఫై త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూ లో అభిమానులకు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







