విడుదల అయిన నా లవ్ స్టోరీ ఆడియో
- June 12, 2018మహీధర్, సాక్షిసింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నా లవ్‌స్టోరి. శివ గంగాధర్ దర్శకత్వంలో జి.లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. గీత రచయితలు శివశక్తిదత్త, భువనచంద్రలు ఆడియోని ఆవిష్కరించి.అతిథులుగా విచ్చేసిన ప్రవీణ్ సత్తారు, అనిల్ రావిపూడి, సి.ఉమామహేశ్వరరావులకు అందజేశారు. అలాగే అనిల్ రావిపూడి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలచేశారు. అతిథులంతా ఆడియోతో పాటు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు శివ గంగాధర్ మాట్లాడుతూ, ఈ సిని మాకు నాలుగు పిల్లర్స్‌గా తోటపల్లి మధు, హీరో మహీధర్, హీరోయిన్ సాక్షిసింగ్, హీరోయిన్ తం డ్రిగా నటించిన శివన్నారాయణ. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే ఈ చిత్రం. గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం అని అన్నారు.హీరో మహీధర్ మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పినపుడే ఈ చిత్రం చేయాలన్న ఆసక్తి మొదలైంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం అని అన్నారు. సంగీత దర్శకుడు వేదనివాన్ మాట్లాడుతూ, ఈ సంగీతం ఇంత బాగా రావడానికి మా టీమ్ కారణం అన్నారు. హీరోయిన్ సాక్షిసింగ్ కూడా మా ట్లాడారు
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం