ఫుట్‌బాల్ ప్రియుల్ని ఉర్రూతలూగించే 'FIFA' ప్రపంచకప్..
- June 13, 2018
ఆ టోర్నీ వస్తే.. ఐరోపా వెర్రెత్తి పోతుంది. అమెరికా ఊగిపోతుంది. ఆసియా అదిరిపోతుంది. ఆఫ్రికా మైమరిచి పోతుంది. ఆ దేశం.. ఈ దేశం అని తేడాలుండవు. ఎవరి జట్టు ఉన్నా లేకున్నా.. అందరూ ఆ టోర్నీకి అభిమానులే. అది అసలు సిసలైన సాకర్ ప్రపంచకప్. వందల కోట్ల మందిని టీవీల ముందు కూర్చోబెట్టే అద్భుత పోరాటాలకు వేదికగా నిలిచే ఫిఫా వరల్డ్‌కప్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది.
ఆట తెలియని వాడు కూడా ఒకసారి అటు ఒక చూపు వేస్తే.. కళ్లు తిప్పుకోవడం కష్టమే.. 90 నిమిషాలు బంతి చుట్టూ ఆటగాళ్లే కాదు.. ఆట చూసే వాళ్లూ తిరగాల్సిందే. అంతలా ఉర్రూతలూగించే ఆ బంతి.. మళ్ళీ వరల్డ్‌కప్‌తో వచ్చేసింది.
నాలుగేళ్లకోసారి ప్రపంచ ఫుట్‌బాల్ ప్రియుల్ని ఉర్రూతలూగించే సాకర్ ప్రపంచకప్ ఇవాళే మొదలుకానుంది. రష్యా వేదికగా ఈ ఏడాది ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. నెల రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ సాకర్ సంబరంలో 32 జట్లు 8 గ్రూపులుగా విడిపోయి హోరాహోరీగా తలపడనున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకున్నారు. మొత్తం 11 నగరాల్లో 12 వేదికలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా... ఒక్కో స్టేడియాన్ని ఒక్కో మోడల్‌లో డిజైన్ చేయడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
వేలాది మంది అభిమానులతో రష్యాలో ఎటు చూసినా ఫుట్‌బాల్ ఫీవర్ పీక్ స్టేజ్‌లో కనిపిస్తోంది. ఒకవైపు జట్లన్నీ ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతుంటే...మరోవైపు తమ అభిమాన ఆటగాళ్ళ విన్యాసాలు చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.
అయితే టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశాలున్న నేపథ్యంలో టోర్నీకి అత్యున్నత భద్రతను ఏర్పాటు చేశారు. ప్రపంచకప్‌కు వస్తున్న అభిమానుల నేపథ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మ్యాచ్‌ల చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్న నిబంధనను అమలు చేస్తోంది. గత ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడ జరిగిన దాడుల కారణంగానే రష్యా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే తమ ఆటతో సాకర్ ప్రపంచాన్ని ఊపేసే మెస్సీ, నెయ్‌మార్,రొనాల్డినో వంటి స్టార్ ప్లేయర్స్ విన్యాసాలతో మరో నెలరోజులు అభిమానులకు పండుగే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..