కెనడాలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- June 13, 2018
ఒట్టావో: తెలంగాణ కెనడా సంఘం (టీసీఏ) ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన శనివారం టోరంటోలోని ఎటోబికోక్ మైరెల్ పవర్ సేయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంబరాల్లో దాదాపు 500 మంది పాల్గొన్నారు.
తొలుత కార్యదర్శి రాధిక బెజ్జంగి అందరికీ ఆహ్వానం పలికారు. అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరు జెండా ఊపి, జ్యోతి ప్రజ్వలతో సభ ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ట్రస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంబాలపల్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. కాసేపు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమానికి కెనడాలోని భారత ప్రభుత్వ ఉప రాయబారి దవీందర్ పాల్ సింగ్, మిస్సిస్సౌగ - మాల్టన్ రైడింగ్ ఒంటిరాయో ప్రొవిన్షియల్ పార్లమెంటు సభ్యులు దీపక్ ఆనంద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలు కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాలను స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ బాణిలో ప్రదర్శించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసింది. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఈ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరు ఆధ్వర్యంలో జరిగాయి. ట్రస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి, ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర ఈద, సెక్రటర రాధిక బెజ్జంకి, కల్చరల్ సెక్రటరీ విజయ్ కుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ సంతోష్ గజవాడ, డైరెక్టర్లు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, ట్రస్టీలు సమ్మయ్య వాసం, శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేష్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాథ్ రెడ్డి కుందూరు, నవీన్ రెడ్డి సూదిరెడ్డి, అఖిలేష్ బెజ్జంకి, వేణుగోపాల్ రోకండ్ల, ప్రకాశ్ రెడ్డి చిట్యాల, హరి రావు, ఇతర వాలంటీర్ల సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి సరయు రెడ్డి చిట్యాల, స్పందన కొండలు వ్యవహరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







