‘ఎన్ఆర్టీ ఐకాన్ టవర్’ నిర్మాణానికి శంకుస్థాపన...
- June 14, 2018
అమరావతి:రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్ఆర్టీ ఐకాన్ టవర్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్ఆర్టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్ఆర్టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్ శాశ్వతంగా ఉంటుంది. 9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్ గ్రూప్ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్లో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







