సెల్ఫీ కావాలని దగ్గరగా వచ్చి..

- June 14, 2018 , by Maagulf
సెల్ఫీ కావాలని దగ్గరగా వచ్చి..

అందమైన అమ్మాయి కనిపిస్తే ఆకతాయిల చూపులన్నీ వారిపైనే.. మరి ఏకంగా హీరోయినే కనిపిస్తే.. ఎగిరి గంతేయరూ.. వారిని దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలనీ.. వీలైతే ఓ ఆటోగ్రాఫ్.. కుదిరితే ఓ సెల్పీ అంటూ వెంటపడరూ.. నటి నుష్రత్ భరూచాకి కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నుష్రత్ దగ్గరకి ఓ అభిమాని వచ్చి ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అని అడిగాడు. కాదనలేకపోయింది.. సరే అని రమ్మంటూ సైగ చేసింది. వచ్చినవాడు పద్దతిగా పక్కన నిలబడకుండా మరింత దగ్గరగా వచ్చి నడుము మీద చెయ్యి వేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన నుష్రత్ కోపం నషాళానికి అంటింది. వెంటనే అక్కడున్న మేనేజర్‌కి కంప్లైంట్ ఇచ్చింది. వారు వచ్చి ఆ యువకుడికి బుద్ది చెప్పి పంపించారు. పాపం నటీ నటులు ఇలాంటి చేదు అనుభవాలను ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నట్టు తెలుగులో నటుడు శివాజీ సరసన 'తాజ్‌మహల్' చిత్రంలో నటించింది నుష్రత్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com