జిసిసి రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ సెక్టార్‌ని
- December 10, 2015
జిసిసి రీజియన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్ అయిన రైల్ నెట్వర్క్ కోసం ప్రైవేటు సెక్టార్‌ని ఆశ్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ రైల్ అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌కి చెందిన ఆరు దేశాలు ప్రాజెక్ట్ రెండో దశకు సంబంధించి డిజైన్ బిడ్స్‌ని విడుదల చేశాయి. సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీద్ అల్ సువాఐకత్ మాట్లాడుతూ, కువైట్ బోర్డర్లోని సౌదిఅల్ ఖఫ్జి టౌన్ బోర్డనని ఈస్ట్ సౌద్ అరేబియాలోని అల్ హోఫుఫ్ మరియు యూఏఈ బోర్డర్లోని అల్ బట్నాని కలిపేలా రైల్ లింక్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరు దేశాలు ప్రైవేట్ సెక్టార్‌ని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలనుకుంటున్నాయనీ, అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉందని వెల్లడించాయి. 2018 నాటికి పూర్తి చేయాలనుకుంటున్న 2117 కిలోమీటర్ల రైల్ లింక్ కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







