తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు

- December 10, 2015 , by Maagulf
తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు
ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌. రియాద్‌లో జరుగుతున్న 36వ గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ సమ్మిట్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిసిసి సభ్య దేశాలతో తాము ఎప్పుడూ సన్నిహిత సంబంధాలనే కోరుకుంటామని చెప్పారాయన. 1981లో జిసిసి ఏర్పాటయ్యింది. ఇందులో బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా మరియు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. జిసిసి సభ్యదేశాలన్నీ తమకు ఉమ్మడి శతృవులుగా పరిణమిస్తున్న తీవ్రవాదం తదితర అంశాలను భావించాల్సి ఉంటుందని, అభివృద్ధిలో అందరం కలిసి ముందడుగు వేయాలని కింగ్‌ సల్మాన్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సంక్షోభంలో ఉన్న యెమన్‌ని ఆదుకోవడం జిసిసి దేశాలు బాద్యతగా తీసుకున్నాయని ఆయన చెప్పారు. సిరియాలో తీవ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికి అండగా ఉండాలని కింగ్‌ సల్మాన్‌ పిలుపునిచ్చారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com