డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన..
- December 10, 2015
నగరంలో బేగంపేటలోని రసూల్పురలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పనులకు తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మొహమద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీటితో పాటు సూరారం చెరువు, గుర్రంచెరువు అభివృద్ధి పనులకు, రక్షాపురంలో మోడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈ నెల 15 తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ముందుగానే అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనలు చేపట్టింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







