మునగ ఆకు గారెలు
- December 10, 2015
కావలసిన పదార్థాలు: మునగ ఆకు - రెండు కప్పులు, శెనగపప్పు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, సన్నగా తరిగిన అల్లం - ఒక టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి - ఒక టీ స్పూను, ఉల్లిపాయ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, పసుపు - చిటికెడు, జీలకర్ర - ఒక స్పూను, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: శెనగపప్పు, పెసరపప్పు ఒక గంట నానబెట్టి బరకగా గ్రైండ్ చేయాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు, మునగ ఆకు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పిండిని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. కరకరలాడే మునగ ఆకు గారెలు తినడానికి రెడీ
తాజా వార్తలు
- దుబాయ్‌లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్‌లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26









