ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- May 14, 2026
రియాద్: సౌదీ ఉద్యోగులు ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం విధించారు. సౌదీ అరేబియా మానవ వనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ' ఖివా ' (Qiwa) ప్లాట్‌ఫారమ్.. సౌదీ ఉద్యోగులు ఒక సంవత్సర కాలంలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటాన్ని నిషేధించింది. మొదటి ఉద్యోగ ఒప్పందం కుదిరిన తేదీ నుండి లెక్కించిన 365 రోజుల వ్యవధిలో ఉద్యోగి అప్పటికే ఏడు ఉద్యోగ ఒప్పందాలను పూర్తి చేసి ఉంటే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సౌదీయేతర ఉద్యోగుల పని అనుమతులు (work permits) గడువు ముగిసినట్లయితే, లేదా జూన్ 30తర్వాత మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు వారు పని అనుమతి లేకుండా కొనసాగినట్లయితే వారి రెసిడెన్సీ హోదా (residency status)తో సంబంధం లేకుండా వారి నమోదును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, ఒక ఉద్యోగి ఏకకాలంలో రెండు ఉద్యోగాలను కలిగి ఉండటానికి అనుమతి ఉందని ఈ ప్లాట్‌ఫారమ్ తెలిపింది.
' నితాఖత్ ' (Nitaqat) కార్యక్రమం కింద ఒక సంస్థ సౌదీ ఉద్యోగి ద్వారా ప్రయోజనం పొందాలంటే, ఆ ఉద్యోగి హిజ్రీ క్యాలెండర్ ప్రకారం కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని తెలిపింది. కనీసం SR 4,000 ప్రాథమిక జీతం పొందాలని ఈ ప్లాట్‌ఫారమ్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!







