బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- May 14, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన జీసీసీ సంయుక్త సహకార కమిటీ 18వ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షత వహించింది. ఈ వర్చువల్ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని అంతర్జాతీయ సహకార మరియు మానవ హక్కుల కార్యాలయ అధిపతి కౌన్సిలర్ అబ్దుల్లా ఇసా అల్ దోసరి అధ్యక్షత వహించగా, జీసీసీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జీసీసీ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని బలోపేతం చేయడం, యూనిఫైడ్ సహకార విధానాలను సమీక్షించడం, న్యాయపరమైన అభ్యర్థనలను పరిష్కరించడంలో వేగం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై చర్చించారు.
అదే విధంగా సంయుక్త గల్ఫ్ న్యాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, చట్టపరమైన మరియు సాంకేతిక పురోగతులకు అనుగుణంగా సహకార యంత్రాంగాలను అభివృద్ధి చేయవలసిన ప్రాముఖ్యతను కూడా అధికారులు తెలియజేశారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!







