వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాలు...
- June 19, 2018
డిగ్రీ అర్హతతో భారత వైమానిక దళంలో పైలట్, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో 182 ఉన్నత స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రక్షణ శాఖ.
ఖాళీలు: 182
పైలట్లకు అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇంటర్‌లో మాత్రం మాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
వయసు: జులై 1, 2019 నాటికి 20 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎత్తు 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండకూడదు.
టెక్నికల్ పోస్టులకు:
విభాగం: ఏరోనాటికల్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)
అర్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన వాళ్లు అర్హులు.
మెకానికల్ విభాగంలో అయితే 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్ క్రాప్ట్స్ మెయింటెనెన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్ లేదా భీఆ పూర్తిచేసిన వాళ్లు అర్హులు.
పై రెండు పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
నాన్ టెక్నికల్ పోస్టులకు:
ఇందులో 4 విభాగాలున్నాయి. అవి 1. అడ్మినస్ట్రేషన్ 2. లాజిస్టిక్స్ 3. అకౌంట్స్ 4. ఎడ్యుకేషన్. కనీస అర్హత 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
అకౌంట్స్ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తి చేసి ఉండాలి.
పై పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో జూన్ 16 నుంచి జులై 15 వరకు
పరీక్ష తేదీ: తెలియజేస్తారు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్: https://afcat.cdac.in, http://careerairforce.nic.in
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..