సలాలా రూట్స్‌లో మవసలాట్ స్పెషల్ ఆఫర్స్
- June 20, 2018
మస్కట్: నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ మవసలాత్, రానున్న ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి సలాలా రూట్లో స్పెషల్ ఆఫర్స్‌ని ప్రకటించింది. జూన్ 22 నుంచి 31 ఆగస్ట్ వరకు ఈ ఆఫర్స్ అమల్లో వుంటాయి. మస్కట్ సలాలా మధ్య రౌండ్ ట్రిప్స్‌కి సంబంధించి రోజూ ఆరు ట్రిప్స్ 600 సీట్లతో అందుబాటులో వుంటాయి. ఒక వైపు ధర 6 ఒమన్ రియాల్స్ కాగా, రౌండ్ ట్రిప్‌కి 10 ఒమన్ రియాల్స్ వసూలు చేస్తారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు (3 నుంచి 12 ఏళ్ళలోపు వారికి) ఫ్యామిలీ టిక్కెట్లో భాగంగా రౌండ్ ట్రిప్ కోసం 25 ఒమన్ రియాల్స్ వసూలు చేయడం జరుగుతుంది. సలాలా మరియు ఇతర లొకేషన్స్‌కి సంబంధించి టిక్కెట్ ధరలు వేర్వేరుగా వుంటాయి.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







