ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ తప్పనిసరి
- December 10, 2015
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని మరియు ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఇమాది చెప్పారు. ఇంధన ధరల పతనం 60 శాతానికి పైగా ఉందని, ఈ పరిస్థితుల్లో నెగెటివ్ ఇంపాక్ట్‌ని తగ్గించి, పాజిటివ్ యాటిట్యూడ్‌తో అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. యూరోమనీ కాన్ఫరెన్స్ ఖతార్ 2015లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధనేతర రంగాల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించవలసి ఉందనీ, కన్‌స్ట్రక్షన్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను రాబడితే దేశ ఆర్థిక రంగం మరింత స్థిరంగా, బలంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ ఖతార్ స్థిరంగా అభివృద్ధి కొనసాగిస్తోందని ఆయన అన్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులేవీ కనిపించకుండా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం