జంబలకిడిపంబ సినిమా రివ్యూ

- June 22, 2018 , by Maagulf
జంబలకిడిపంబ  సినిమా రివ్యూ

జంబలకిడిపంబ ఈ పేరు చెపితే నవ్వకుండా ఉండలేరు. ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన విజయవంతమైన హాస్యభరిత చిత్రం ఇది. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా బుల్లితెర ఫై వచ్చిందంటే అందరూ టీవీ ల ముందు కూర్చుని హ్యాపీ గా నవ్వుకుంటారు.
తాజాగా ఇప్పుడు అదే జంబలకిడి పంబ టైటిల్‌తో శ్రీనివాసరెడ్డి హీరోగా శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం లో తెరకెక్కడం జరిగింది. దీంతో ఈ సినిమా ఫై చాల మంది ఆసక్తి కనపరుస్తున్నారు. మరి ఆ జంబలకిడి పంబ లాగానే ఇది కూడా ఉందా..? లేక మరోలా ఉందా..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.
కథ :
వరుణ్ , పల్లవి (శ్రీనివాస్‌ రెడ్డి, సిద్ధి ఇద్నానీ) ప్రేమించుకుంటారు..పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వీరిద్దరూ పెద్దల సమక్షం లో తమ ప్రేమను తెలియపరుస్తారు. అయితే వీరి ప్రేమను ఇరు పెద్దలు నిరాకరించడం తో ఇంట్లో నుండి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారం లో గొడవలు మొదలు అవుతాయి.
దీంతో లాయర్ ను కలిసి విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. విడాకులు ఇవ్వడం లో ప్రత్యేకత కలిగిన హరిశ్చంద్రప్రసాద్ (పోసాని కృష్ణ మురళి) ను ఆశ్రయిస్తారు. వరుణ్‌, పల్లవిలను విడగొడితే వంద జంటలకు విడాకులు ఇప్పించిన న్యాయవాదిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతానని సంబరపడుతుంటాడు.
ఇంతలో ఓ రోడ్డు ప్రమాదం లో హరిశ్చంద్రప్రసాద్ అతని భార్య చనిపోతారు. ఆత్మగా యమపురికి వెళ్లిన అతనికి ఓ వింత సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏంటి..? వరుణ్‌, పల్లవి లు విడాకులు తీసుకున్నారా..లేదా..? జంబలకిడి పంబ అనే టైటిల్ కు కథ కు సంబంధం ఏంటి అనేది మీరు తెరపై చూడాల్సిందే.
ప్లస్ :
* శ్రీనివాస్ రెడ్డి - సిద్ధి ఇద్నానీ యాక్టింగ్
* అక్కడక్కడ కామెడీ
* నేపథ్య సంగీతం
* కెమెరా పనితనం
మైనస్ :
* సాగదీత సన్నివేశాలు
* కథ - కథనం
* మ్యూజిక్
నటీనటుల పెర్పామెన్స్ :
* కమెడియన్ గా రాణించిన శ్రీనివాస రెడ్డి..గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరోసారి హీరోగా జంబలకిడి పంబ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కోసం శ్రీనివాస్ బాగానే కష్టపడ్డాడు కానీ కథలో దమ్ము లేకపోవడం తో ఆయన పడ్డ కష్టం వృధా అయ్యింది. అమ్మాయి లక్షణాలతో శ్రీనివాసరెడ్డి కాస్త నవ్విచే ప్రయత్నామ్ చేసాడు.
* ఈ మూవీ తో తెలుగు తెరకు పరిచమైన సిద్ధి ఇద్నానీ.. చక్కటి అభినయం కనపరిచి ఆకట్టుకుంది. డైలాగ్స్ చెప్పడంలోనూ పరిణతి కనపరిచింది. అబ్బాయి హావభావాలతో కన్పించే సన్నివేశాల్లోనూ కాన్ఫిడెంట్‌గా నటించి ఫుల్ మార్కులు కొట్టేసింది.
* సత్యం రాజేశ్ ప్రవర్తించే విధానం సహజంగా ఉంటుంది. హరితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ తన పరిధిలో బాగా నటించారు.
* ఆత్మ గా పోసాని పాత్ర పర్వాలేదు అనిపించినా పదే పదే రావడం తో కాస్త విసుగు తెప్పించింది.
* ధన్‌రాజ్‌, చిత్రం శీను, రఘుబాబు, తనికెళ్ల భరణి తదితర నటులు ఉన్నప్పటికీ కామెడీ పెద్దగా పండలేదు.
సాంకేతిక విభాగం :
* గోపిసుందర్ నేపధ్య సంగీతం బాగుంది. కానీ పాటల విషయంలోనే ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు.
* సతీశ్ ముత్యాల కెమెరాపనితనం సినిమాకు హైలైట్ గా నిలిచింది.
* నిర్మాణ విలువలు మామూలుగానే ఉన్నాయి.
* ఇక డైరెక్టర్ మను విషయానికి వస్తే అబ్బాయిల బాధలను అమ్మాయిలకి, అమ్మాయి బాధలేంటో అబ్బాయిలకు తెలియాలనే ఆలోచనతోనే ఈ కథను రాసుకున్నాడు. కాన్సెప్ట్‌ వరకు బాగానే ఉన్నా..తాను అనుకున్న విషయాన్ని తెరపైకి తీసుకురావడంలో మాత్రం తడబడ్డాడు.
ఫస్ట్ హాఫ్ అంత హీరో - హీరోయిన్ మధ్య గొడవ తో నడిపించిన డైరెక్టర్ , సెకండ్ హాఫ్ వీరిని కలిపేందుకు లాయర్ ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది చూపించాడు. కానీ చూపించిన తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. సాగదీత సన్నివేశాలు , కమెడియన్స్ చాలామందే ఉన్నప్పటికీ వారిని వాడుకోలేకపోవడంతో సినిమా ఎప్పుడు అయిపోందా అని ప్రేక్షకులు ఎదురుచూసారు.
చివరిగా :
* పాత జంబలకిడి పంబ చిత్రాన్ని దృష్టి లో పెట్టుకొని సినిమాకెళ్తే నిరాశ చెందుతారు. సాగదీత సన్నివేశాలు , విసుగు తెప్పించే పాత్రలు, ఆకట్టుకోలేని సంగీతం , పస లేని కథ ఇవ్వన్నీ కూడినదే జంబలకిడి పంబ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com