ప్రముఖ నిర్మాత పాల వ్యాపారం: లీటర్ @ 150
- June 22, 2018
తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యాపార లక్షణాలు కొనసాగిస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు దగ్గుబాటి సురేష్ బాబు. తాజాగా మరో రంగంలోకి కూడా కాలిడబోతున్నారు. హ్యాపీ ఆవులు పేరుతో స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు. నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభించే పాలు, కూరగాయలను వాడడం వలన అనారోగ్యానికి గురయ్యాడట. దాంతో తానే పాల వ్యాపారం, సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయల వ్యాపారం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చిందట. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కాకుండా ప్రజలకు నాణ్యమైన పాలను అందించాలనే సంకల్పంతో పాటు బయట దొరుకుతున్న పాలకు, స్వచ్ఛమైన పాలకు ఉన్న తేడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే పాల వ్యాపారం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ధరను కూడా లీటరు ప్యాకెట్‌కి రూ.150లకు విక్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







