మదిని మీటిన వర్షం-పార్ట్-7

- December 10, 2015 , by Maagulf

మొత్తానికి కాశి యాత్రకు బయల్దేరాడు రాజు గాడు గొడుగు పట్టుకున్నాడు నేను పక్కన ఉన్నా … మండప ద్వారం వెళ్ళగానే బామ్మర్ది గాడు ఎదురయ్యాడు "బావ వెళ్లొద్దు మా అక్కని నీకు ఇస్తా పెళ్లి చేస్కో అని నీ కోసం మా అక్క వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది" … వీడు సరే అని ఊపబోతుంటే తల పట్టుకొని అడ్డం ఊపించి …. “వద్దులే బామ్మర్ది మొన్న మీ అక్క తన్నింది అంట పెళ్ళికి ముందే పరిస్థితి ఇలా ఉంటె పెళ్లి తరువాత రోజు ఇంకా చాకలి బండనే మా వాడి పరిస్థితి … పెళ్లి అంటే వణికిపోతున్నాడు మీ బావ అందుకే సన్యాసం తీసుకుంటాడు అంట … హిమాలయాలకు వెళ్లి రంభ ఊర్వశి మేనక కోసం తపస్సు చేస్తూ ఏదో ఈ జన్మ ఇలా గడిపేస్తాడు అంట వదిలేయ్” అన్న అంతే అక్కడ ఉన్న వాళ్ళందరు నవ్వేసారు…అభి మాత్రం వీడు తిడుతున్నాడ పొగుడుతున్నాడ అనట్టుగా మొహం పెట్టాడు “ ఇంతలో వర్ష “ భరత్ గారు ఒక ఉత్తమ ఇల్లాలికి ఉండాల్సిన లక్షణాలు అన్ని మా నందుకి ఉన్నాయి … తన ఇంటి కోసం తన వారి అవసరాల కోసం తను అలుపుఎరగక ఎప్పుడు కష్టపడుతూ ఉండే ఇల్లాలు.... ఎటువంటి సమస్య అయిన ఓర్పుతో సలహాలిచ్చి వెంట ఉండి పరిష్కరించగల తెలివైన సహధర్మచారిణి … అమ్మ లాగ ప్రతి ఒక్కరి ఆకలి ఆలోచిస్తూ కమ్మని రుచి కరమైన వంటలు వండి కడుపు నిండా పెట్టె అన్నపూర్ణ …. మీరు చెప్పిన రంభ ఊర్వశి మేనకలను తల దన్నె అందం కలిగి ఉండి సంసార ధర్మంలో భర్త మనసెరిగి నడుచుకునే ఆలి … అన్ని ఉన్న అణుకువ అనే అందం కలిగి లక్ష్మిదేవి లాంటి రూపం ఉన్న మగువ .. ఎలాంటి కష్టాలైన బాధల్ని అయిన తన కడుపులో పెట్టుకొని అందరిని అక్కరకు చేర్చుకునేంత ఓర్పు సంతోషాన్ని పంచె గృహిణి … ఇంత మంచి అమ్మాయి కొట్టింది అని అబద్ధాలు చెప్పి పెళ్లి వద్దునుకుంటున్నారు మీ స్నేహితుడు ఇలాంటి అమ్మాయి దొరకాలి అంటే అద్రుష్టం చేసి ఉండాలి“అని చెప్తున్నవర్ష ని అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయా ఎంత బాగా చెప్పింది “కార్యేషు దాసీ .. కరణేషు మంత్రి . భోజ్యేషు మాత .. శయనేషు రంభ … రూపేషు లక్ష్మి .. క్షమేయే ధరిత్రి ….” అనే లక్షణాలను ఇంత కంటే గొప్పగా అందంగా ఎవరు చెప్పలేరు అని ఆనందం వేసి చప్పట్లు కొట్టాను నన్ను చూసి అందరు చేతులు కలిపారు తననే చూస్తూ నిలపడ్డాను తను సిగ్గు పడుతూ చూస్తోంది నన్ను …. “అరె మామ ఇంత మంచి అమ్మాయిని చేసుకునే అర్హతలు నీకు ఉన్నాయా ?? వద్దులెండి వర్ష గారు అలాంటి దేవతని అలాంటి గుణాలు ఉన్న ఒక మంచి అబ్బాయిని చూసి చేద్దాం …. చూస్తూ చూస్తూ తన జీవిత నాశనం చేయలేనులెండి కాకి ముక్కుకి దొండ పండు లాగ వీడికి ఎందుకు అంత మంచి అమ్మాయి మేము ఒప్పుకోము అండి వెళ్తాము కాశి హిమాలయాలకి ముక్కు మూసుకొని తపస్సు చేస్కుంటాం“.... "రేయ్ నువ్వు ఆపార నువ్వు చెప్పేది వింటే నేను నిజంగా చెడ్డవాడిన అని నాకే డౌట్ వస్తుంది .... నేను ఎక్కడికి పోవడం లేదు వాపస్ మండపం లోకి వెళ్లి పెళ్లి చేసుకుంట ఎవరు ఏమి చెప్పిన తూచ్ వినొద్దు" అని వాపస్ వెళ్తుంటే వాణ్ణి కూర్చో పెట్టి బామ్మర్ది కాళ్ళు కడిగి చేతికి బంగారు కడియం వేసి గొడుగు వేసి లోపలి తీసుకెళ్ళాడు ... కాళ్ళు కడినందుకు వీడు ఉంగరం తొడిగాడు బామ్మర్ధికి ... అలా లోపలి పోతుంటే "రేయ్ కడిగితే బంగారం ఇస్తాను అంటే మూతి నుంచి ముడ్డి అన్ని కడిగే వాళ్ళం అనే సరికి గ్యాంగ్ లో నవ్వులు విరిశాయి .... అభి ని పెళ్లి పీటల మీద కుర్చోపెట్టాము నందు కోసం చూస్తూ ఉన్నాము

 

పల్లకిలో పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారు మేనమామలు అందరు కలిసి, … పక్కన ఉన్న బండదానితో “లారక్క మీ ఇంట్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉందా?? “ దానికి మాత్రమే వినపడేలాగా …దేనికి అని కళ్ళు కోపంతో ఎగిరించింది “ఉంటె జక్కన ని అడిగి బాహుబలి సినిమా నుంచి ఒక పది మంది కలకేయుల్ని నిన్ను కుర్చోపెట్టడానికి చెత్త డబ్బా ని తెప్పిద్దాం“ … “అంత మంది ఎందుకు లేరా ప్రభాస్ ని పిలిపించు శివ లింగం ఎత్తుకునట్టు నన్ను ఎత్తుకొని వచ్చి కుర్చోపెడతాడు…” "ఎన్ని ఆశలో బండడానికి అయిన నువ్వు శివలింగం కాదే శివుడి ముందు ఉండే నంది పక్కన ఉండే గంగిరేద్దువి నిన్ను మోయాలి అంటే కాలకేయులే కరెక్ట్ నీ కలర్ కి పర్సనాలిటీ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతారు“అని ఎక్కిరించా… రేయ్ ఓవర్ చేస్తే పగులుద్ది … “వద్దులే అక్క నన్ను నమ్ముకొని చాల మంది ఆడంగులు ఉన్నారు“ “తు సిగ్గు లేనోడా నేను పగలకోదత అనింది మూతిరా” … “ నేను కూడా చెప్పింది దాని గురించే లే నా మాట పాట వినాలని చాల మంది ఈ పెళ్లి లో వెయిట్ చేస్తున్నారు నువ్వు పగలకొడితే వాళ్ళు తట్టుకోలేరు … ఎకసేట్టరాలు చేసావనుకో నా ఫాన్స్ తో చితక బాదిస్త” అని చెప్తుండగా ఇందాకటి జంబాల్ హాట్ ఆంటీ నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చింది "చూసావా నాకు ఆంటీస్ లో కూడా ఫాన్స్ ఉన్నారు” అని మోహన్ బాబు స్టైల్ లో చెప్పా…పల్లకి పెళ్లి వేదిక దగ్గరకు వచ్చింది … పల్లకిలో నందిని మేలిముసుగుతో, బాసికం కట్టుకొని, గోరింటాకు చేతుల్లో కొబ్బరి బొండం పట్టుకొని సిగ్గు పడుతూ కూర్చుంది… తనని దించుకోవడానికి వర్ష తన దగ్గరకు వెళ్తోంది … జారిపోయే పట్టుకురులను బందించి జడ వేసి దానికి జడ గంటలు కట్టింది తన నడిచే వయ్యరానికి జడ గంటలు అటు ఇటు ఊగుతున్నాయి నేను కూడా వాటికి తాళం వేస్తూ తల అటు ఇటు ఊపుతున్న … అది చూసిన బండది “ తు ఎదవ ఎం చూస్తున్నావు రా సిగ్గు లేదా “ లేదక్కా జడ గంటలు చాల బాగున్నాయి వాటిని చూస్తున్న నువ్వు లేని పోనీ అభాండాలు వేసి వర్ష ముందు చెడ్డ చేయొద్దు”… నందిని పెళ్లి పీటల దగ్గర తీసుకొని వచ్చి కుర్చోపెట్టింది.. నన్ను వర్షని ఒక పరదా ఇచ్చి పటుక్కొని నిలపడమని చెప్పారు …. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు చిన్న చిరునవ్వు ఇచ్చాను తన కళ్ళు మాత్రం కోపంతో చూసాయి నన్ను, తనని ఫూల్ ని చేసినందుకు, అసలు చూడనట్టు పట్టించుకోనట్టు కోపం నటిస్తూ ఉంది.. “రేయ్ ఎదవ ఏడూ వేల కోసం ఏడూ వారల నగల లాంటి అమ్మాయి ని వదులుకుంటావా నిన్ను ఎవడు మార్చలేడు ఇంకా నీకు లైఫ్ లో మంచి దొరికినట్టే క్షమించమని అని అడిగి తగలడు” అని ఘోష, “చి చి నేను అడగను అయిన తను చెవులు గుంజిన దానికి ఏమిన చెప్పిందా?? దానికే కదా అయ్యగారు ఏడిపించింది సింహం ఇక్కడ తగ్గే సమస్య లేదు” అని నోరు మూయించ తనను నా సైడ్ చూడగానే సారీ అన్నాను… “ఇందాక తగ్గాను అన్నావు ఇప్పుడు సారీ చెప్పావు అంతేర సింహలైన పులులైన అమ్మాయిల ముందు పిల్లులే.. కొప్పులకి నిప్పులు అంటిస్తే ఇలాగే తుప్పులు వదిలిస్తారు“ మళ్లీ శోష… “అయిన ఏంటో మా మగాళ్ళ బతుకులు ఎవరు తప్పు చేసిన మేమే సారీ చెప్పాలి అని ఏడ్పు మొహం పెడుతూ” … మంత్రోచ్చారణలు జరుగుతున్నాయి నాకు ఏమి వినపడటం లేదు అభి నందు చేతల్లో జీలకర్ర బెల్లం పెట్టారు చేతలు పరదా కింద ఉన్నాయి… ఇంకో సారి కళ్ళు కలిసినప్పుడు సారీ చెప్పను అయిన కన్విన్సు కాలేదు … నాకు చిరాకుగా ఉంది ఇబ్బందిగా నిలపడి అటు ఇటు కదులుతూ అందరిని చూస్తున్న ఇదంతా గమనిస్తున్న లారక్క అభి గాడు నాలిక బయట పెట్టి ఎకిరిస్తున్నారు నాకు ఇంకా కాలిపోతోంది పరదా సరిగ్గా పట్టుకోవడం లేదు … పరదా వెళ్లి చేతుల మీద పడుతోంది పాపం పంతులు గారు వయస్సు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి సర్దుతూ ఉన్నాడు ఇంకా ఆపుకోలేక…. “బాబు అజీర్తి చేసింద నాయన అని అడిగాడు “ ఛి ఛి ఆల్రెడీ వర్ష మాట్లాడటడం లేదు అని బాధగా ఉంటె ఈ పంతులు గారు కౌంటర్ వేస్తున్నాడు “రేయ్ భరత్ నీ ప్లేస్ లో నేను ఉనిన్తె సీస మూతిలో నీళ్ళు పోసుకుని అందులో దుమికి చచ్చే వాణ్ణి” అని ఆత్మ రాముడు "అయితే చావు నాకు నీ గోల తగ్గుతుంది" … “ఎం లేదండి పంతులు గారు" “ మరి పరదా సరిగ్గా పటుకోవడం లేదు?? బాత్రూం కి అర్జెంటు అయిన వాడి లాగ అటు ఇటు ఊగుతూ డాన్సు లు కట్టేస్తున్నావు సరిగ్గా పట్టుకో నాయన పెళ్లి అయ్యేవరకు ఒకరి మొహం ఒకరు చుసుకోరాదు” అభి నందు వర్ష లారక్క నవ్వుతున్నారు ఒక వెకిలి నవ్వు నవ్వి వర్ష ని చూసా మళ్లీ కోపంగా పెట్టింది మొహం కళ్ళు సీరియస్ గా చూస్తున్నాయి ఏంటి ఈ టార్చర్ నాకు “ మీరు మరి పంతులు గారు అరగంట ముదు వరకు చూసుకున్నారు అప్పుడు లేనిదీ ఇప్పుడు ఏంటి” “ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం నాయన అలా అనకూడదు బాసికాలు కట్టుకున్నాక అమ్మాయి అబ్బాయి పెళ్లి జరిగేదాకా చూసుకోకూడదు అసలు మా కాలం లో అయితే పెళ్లి వరకు ఒకరిని ఒకరం చూసుకునే వాళ్ళం కాదు అసలు” “కరెక్ట్ పంతులు గారు చూసింటే మీ ఆవిడ మిమ్మల్ని చేసుకుని ఉండేది కాదు” అని ఇందాక కౌంటర్ కి ఎన్కౌంటర్ వేసా మెల్లగా …. చుసుకుంట నిన్ను తరువాత అనట్టు చూసాడు ఛి ఛి ఏంటి నోటి దూల ఇంకా ఈయన కూడా పగ పట్టేసాడు.. ఇంతలో పంతులు గారు “ముహూర్తం … గట్టి మేళం అంటూ జీలకర్ర బెల్లం తల పైన పెట్టించారు పరదా తీసి వేసాము …”అభి నందు మొహంలో సంతోషం నా మొహంలో చిరాకు వర్ష మొహంలో నన్ను ఏడిపిస్థున్న ఆనందం లారక్క మొహం వెటకారంతో వెలిగిపోతోంది...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com