కూతురి చిత్రానికి క్లాప్ కొట్టిన నాగబాబు
- June 23, 2018
హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ."ముద్దపప్పు ఆవకాయ్", "నాన్నాకూచి" వెబ్ సిరీస్ తరువాత మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాము. ఈ సినిమాకు సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు" అన్నారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ."డైరెక్టర్ ప్రణీత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఈ సినిమా ఉంటుంది. నా మొదటి సినిమా "ఈ మాయ పేరేమిటో" సొంత నిర్మాణ సంస్థలో చేశాను. కథ నచ్చడంతో బయటి బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. శివాజీ రాజా గారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు" అన్నారు.
సినిమా చాలా కొత్తగా ఉంటుంది
నీహారిక కొణిదెల మాట్లాడుతూ."ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'నీర్వాణ సినిమాస్' ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు. డైరెక్టర్ ప్రణీత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా కొత్తగా తను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు. నటుడు శివాజీరాజా మాట్లాడుతూ."క్లారిటీ ఉన్న దర్శకుడు ప్రణీత్. గతంలో ప్రణీత్ తో నేను నాన్నకూచి వెబ్ సిరీస్ చేశాను. తను మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహించడం అందులో నేను ఒక ముఖ్య పాత్రలో నటించబోతుండడం ఆనందంగా ఉంది" అన్నారు.
నటీనటులు:
రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, శివాజీ రాజా, సత్య, కోటేశ్వర రావ్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ప్రణీత్ బ్రమనదపల్లి, నిర్మాత: సందీప్ యర్మారెడ్డి, సుజన్ యారబోలు, రామ్ నరేష్, కెమెరామెన్: హరిజ్ ప్రసాద్, మ్యూజిక్: మార్క్ కె రాబిన్, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, లిరిక్స్: కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్, కో డైరెక్టర్: దాసం ప్రసాద్, పి. ఆర్.ఓ: వంశీ - శేఖర్, పబ్లిసిటీ: అనిల్ & భాను, కాస్టూమ్ డిజైనర్: భార్గవి అంబటి, గౌరీ నాయుడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







