హీరో నానితో మరోసారి కీర్తి సురేష్!
- June 23, 2018
టాలీవుడ్ లో ఈ మద్య మాలీవుడ్ హీరోయిన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటికే నయనతార, సమంత టాప్ లీడ్ లో ఉండగా ఈ మద్య సాయి పల్లవి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా మంచి ఫామ్ లోకి వచ్చారు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నానితో 'నేను లోకల్' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. వెంటనే పవన్ కళ్యాన్ లాంటి టాప్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.ఈ సినిమాలో కీర్తి సరేష్ నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రెటీలు ఫిదా అయ్యారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపున దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న విషయం తెలిసిందే..సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ సినిమా కోసం నాని క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇక దర్శక నిర్మాతలు కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి .. కీర్తి సురేశ్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గతంలో నాని .. కీర్తి సురేశ్ కలిసి నటించిన 'నేను లోకల్' హిట్ కావడం ఒక కారణమైతే, 'మహానటి' హిట్ తో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోవడం మరొక కారణం. తెరపై నాని, కీర్తి జంటకు మంచి మార్కులే పడతాయని ఫిక్స్ అయ్యారు. దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!