ఆర్మీ మేజర్ భార్య గొంతుకోసి.. శరీరం మీదనుంచి వాహనం పోనిచ్చి..
- June 23, 2018
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆర్మీ మేజర్ భార్యను గొంతుకోసి ఆపై వాహనాన్ని శరీరం మీదుగా పోనిచ్చారు. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో గురైంది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించి.కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ కొద్ది గంటలక్రితం మిస్ అయిన ఆర్మీ మేజర్ భార్యగా గుర్తించారు.
హత్యకు గురవకముందు 30 ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ కు వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళాడు. అయితే ఆమె కొద్దిసేపటికే మిస్ అయింది. ఆ తర్వాత కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో సదరు మహిళ ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. దుండగులు ఆమెను గొంతుకోసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న మేజర్ మృతదేహం తన భార్యదేనని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు ఢిల్లీ పోలీసులు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







