ఫెస్టివ్ సీజన్ మార్కెట్లు ప్రారంభం
- December 10, 2015
క్రిస్‌మస్ కోసం ముందస్తుగా షాపింగ్ చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ వీకెండ్ దుబాయ్‌లో ఎటు చూసినా షాపింగ్ సందడే కనిపించనుంది. దీనికోసం వ్యాపారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అల్ సర్కాల్ ఎవెన్యూలో 'అప్‌సైకిల్డ్ అర్బన్ మార్కెట్'ని ప్రారంభించారు. రీసైకిల్డ్, బయోడీగ్రేడబుల్ ఐటమ్స్‌తో, సహజసిద్ధమైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌తోపాటు లైవ్ మ్యూజిక్ మరియు ఫుడ్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 8 గంటల వరకు రెండ్రోజులపాటు ఈ మార్కెట్ తెరచి ఉంటుంది. అర్బన్ బ్లాక్ పార్టీ పేరుతో డిసెంబర్ 10, 12 తేదీల్లో బిజినెస్ డే బేస్క్వేర్‌లో మరో షాపింగ్ సందడి సిద్ధంగా ఉంది. వాఫిలోని రాఫెల్స్ గార్డెన్ క్రిస్‌మస్ షాపింగ్‌కి రెడీ అయ్యింది. 20 మంది వ్యాపారులు సీజనల్ ట్రీట్స్‌ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ కూడా షాపింగ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. డిసెంబర్ 17 నుంచి 19 వరకు మరో షాపింగ్ ఫెస్టివల్ దుబాయ్ వాసులకు ఆనందాన్ని పంచనుంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకు నిర్వహించే విలేజ్ మార్కెట్ దుబాయ్ వాసులకు ప్రత్యేకమైన సందడిని తీసుకొస్తోంది. దీనికి ఎంట్రీ టిక్కెట్‌ని 20 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







